eknazar - desi lifestyle portal
Pittsburgh
Advertise | Contact Us
My Account
Techfios FunAsia


News

TANTEX 127 NELA NELA VENNELA
Date: Feb 22 2018 Submitted By:  

పద్యంనుంచివచనకవిత్వందాకా
ఘనంగా ముగిసిన టాంటెక్స్ 127వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
ఫిబ్రవరి18, 2018 డాలస్, టెక్సస్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించు "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారం, ఫిబ్రవరి18 న సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది.
ప్రవాసంలో నిరాటంకంగా 127 నెలలుపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ యొక్క విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేసారు.

కార్యక్రమంలో ముందుగా కుమారిచామకూర కీర్తిదాశరధిగారురచించిన ఎవరయ్యానీవెవరయ్యఅనే చక్కనిప్రార్ధనగీతంతో కార్యక్రమంప్రారంభంఅయ్యింది . తదుపరి శ్రీ బసాబత్తినశ్రీనివాసులుమాట్లాడుతూ మహమ్మద్ఖదీర్బాబురచించిన దర్గామిట్టకథలుపుస్తకపరిచయంచేసారు. మతసామరస్యమే ప్రధానముగా ఈ కథలలో మహమ్మద్ఖదీర్బాబు నెల్లూరుయాసలో రచించారని, మహమ్మద్ఖదీర్కుఖదీర్బాబు అనే పేరు ఎలావచ్చిందో వివరించారు. మీసాలసుబ్బరాజుగారు ఖదీర్బాబుఅనినామకరణంచేయడం , అతనికి పాటలు ఇష్టం కానీ పాడే అవకాశం రాకపడేతపనకూలంకుషంగా వివరించారు. ఖసాబ్గల్లీలోసేమియాముగ్గు అనే కథలో సేమియాతయారుచేసేమిషన్, దానినివంతులవారీగాఅందరూపంచుకోవడంగురించి, నెల్లూరులోజరిగేరొట్టెలపండుగగురించి, అక్కడి మహమ్మదీయులజీవనవిధానం గురించి తెలియాలంటే ఖదీర్బాబుగారి కథలు తప్పక చదవమని చెప్పారు.

చిన్నారులువేములసాహితి, సింధూర , నందిమండలం సాహిత్య , సాహితి , శంకరంబాడిసుందరాచారిగారురచించిన మాతెలుగుతల్లికిమల్లెపూదండగీతాన్ని ముద్దుముద్దుగా గానంచేసి తెలుగుభాషమీదఅభిమానాన్నిఘనంగాచాటుకొన్నారు. శ్రీదొడ్లరమణమాట్లాడుతూ శ్రీకృష్ణవచనామృతం అనేపుస్తకాన్నిపరిచయంచేశారు. ప్రస్తుతం సంఘంలోతరిగిపోతున్నదిశాంతి,ఈవర్తమానకాలంలో, ప్రస్తుతపరిస్థితులలో మనకుఅత్యంతఅవసరమైనదిశాంతిఅని, 700 పద్యగద్యశ్లోకాలతోనిండినఈపుస్తకం ,ప్రస్తుతకాలానికిఎంతోఅవసరమైనపుస్తకంఅనితెలిపారు. శ్రీ పుదూర్జగదీశ్వరన్ , తానురచించినశతకంనుంచిఒకపద్యాన్ని, శ్రీచంద్రహాస్మద్దుకూరిప్రసిద్ధపాటలరచయిత కొసరాజుసినీసాహిత్యంగురించి , ఆయనమరపురానిపాటలగురించి మాట్లాడారు . 1938లోవిడుదలైన రైతుబిడ్డసినిమా, కొసరాజుగారుపాటలు రాసినమొట్టమొదటిసినిమా అని తెలియచేసారు. నందామయాగురుడనందామయా, శివశివమూర్తివిగణనాథా పాటలుఅత్యంతప్రాముఖ్యమైనవిఅని, రోజులుమారాయిసినిమాలో 7 పాటలురాసారు, ఏరువాకసాగరోపాటరాశారుఈనాటికితెలుగుమనస్సులోనిలిచిపోవడంఆయనగొప్పదనమేఅనితెలిపారు. పెద్దమనుషులులోనందమయాగురుడనందామయా అనేపాటచక్కగా పాడిఅలరించారు.

డా. ఊరిమిండినరసింహరెడ్డి - మనతెలుగుసిరిసంపదలుశీర్షికన, నానుడి , జాతీయాలు , పొడువుకథలుగురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తిరేకెత్తించారు. చాపక్రిందనీరు, చుక్కలుచూసికుక్కలుమొరిగినట్లు , చుట్టాలసురభి , ఇంకాఎన్నో సామెతలువాటిఅర్ధాలువివరించారు. శ్రీవేములలెనిన్శివసాహిత్యంలోకొన్నిసంగ్రహణలు అనేఅంశంపైమాట్లాడుతూ, బెజ్జమహాదేవిశివునితల్లిగా ఉంటే ఆవిడ అనురాగం ఎలా ఉండేదోఫాల్కురికి సోమనాథుడువివరించినట్లుకొన్నిఉదాహారణలతోతెలిపారు. శివశివభరణంఅనిశ్రావ్యంగాగానంచేశారు. ఆధునికకవులలో సిరివెన్నెలసీతారామశాస్త్రి ఆదిభిక్షువువానిఏదికోరేదిఅనేపాటలోశివతత్వాన్నిఎంతచక్కగావివరించారోగానయుక్తంగావివరించారు. సుద్దాలఅశోకతేజ రచించిన నటరాజుపూజ చేసే అనేపాటకు జాతీయఅవార్డు వస్తేఎంతోబాగుండేది అని గుర్తుచేసుకొన్నారు.

శ్రీమతిఅట్లూరిస్వర్ణకొన్నిఛాయాచిత్రాలుచూపించివాటిద్వారాసామెతలపూరణంచేయించడం, ఎంతోఆసక్తికలిగించింది. తెలుగుభావకవిత్వంనిఆంగ్లంలోలిరికల్పొయిట్రీఅంటారు, తెలుగుభాషాదినోత్సవంఎప్పుడుజరుపుకొంటారు, భరతునిభార్యపేరుఏమిటి,ఇలా ఎన్నోఆసక్తికరమైనవిషయాలతోక్విజ్నిర్వహించారు.పాలకమండలి అధిపతి చంద్రకన్నెగంటి ముఖ్యఅతిథిశ్రీహెచ్చార్కెనిసభకు పరిచయంచేశారు. పద్యంనుంచి వచనకవిత్వందాక మార్పుఎలాసంభవించిందో అనే అంశంమీదప్రసంగించారు. కర్నూలుజిల్లాగనిఅనేచిన్నపల్లెటూరులో, కనీసవసతులు లేని చోటజన్మించిన తనకు, ఊరికిఉన్నఒకేఒక్కరేడియోదగ్గర పద్యాలువింటూ, వాటిపైఆసక్తి పెంచుకున్న సంఘటనలు వివరించారు. చిన్నతనంనుండి తనకుసీసపద్యాలుఅంటేఇష్టంఅని, తానుకూడాకొన్నిపద్యాలురాశానుఅనితెలియచేసారు. తదుపరివచనపద్యం పైనున్నఆసక్తితో, వచనకవిత్వంవైపు పయనించాను అనితెలియచేసారు. గురజాడవెంకటఅప్పారావువచనకవిత్వానికిఆద్యుడుఅని, ముత్యాలసరాలులో 14 మాత్రలుఉంటాయని, మాత్రఛందస్సులో సులభగ్రాహ్యంగా ఉంటుందిఅని, వాటిఅందమేవేరుఅనికొన్నిపద్యాలుచదివివినిపించారు. తెలుగుఛందస్సులో రెండుమెట్లుదిగినఛందస్సు ఏదైనాఉందిఅంటే అది ముత్యాల సరాలు అని తెలిపారు. పద్యంసరళంగా ఉంటే అందంగా ఉంటుంది అని తిరుపతి వెంకటకవులు రాసిన పద్యాలు ఎంతోసులభంగా ఉంటాయి ఉదాహారణలతోతెలిపారు. స్వేచ్ఛ అంటే కట్టుబాట్లునుండి విముక్తిఅని, కృష్ణశాస్తి తర్వాతఅంతబాగాస్వేచ్ఛను అందిపుచ్చుకొన్నవాడు ఇస్మాయిల్అనితెలిపారు. ఈసందర్భముగా ఇస్మాయిల్రాసినపద్యాలు కొన్ని ఉదహరించారు. స్వేచ్చకుఉన్నపరిమితులు అర్ధంచేసుకున్న వాడు ఆధునికుడు. పట్టాభిఫిడేల్రాగాలు తప్పకుండా చదవాలిఅని గుర్తుచేశారు. ఆయనరాసిన పద్యాలు చక్కగా చదివివినిపించారు. వచనపద్యాల గొప్పతనం ఫిడేల్రాగాలలోఎంతచక్కగా రాసారోవివరించారు.

హెచ్చార్కెగారిని టాంటెక్స్సాహిత్యవేదికసభ్యులు, అధ్యక్షురాలుశ్రీమతిశీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడువీర్నపు చినసత్యం, పాలకమండలిసభ్యులు శాలువా, జ్ఞాపికఇచ్చి ఘనంగాసత్కరించారు. హెచ్చార్కె గారు తననుఎంతోఆదరించి, చక్కటిఆతిధ్యంఅందించిన టాంటెక్స్ కార్యవర్గానికికృతజ్ఞతలుతెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలుశ్రీమతికృష్ణవేణిశీలం గారుమాట్లాడుతూ మారుమూలపల్లెటూరులోజన్మించి, కవిగా, జర్నలిస్ట్గాఎనలేనిసేవచేసిన హెచ్చార్కె గారిసేవలనుఎంతోకొనియాడారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 5, మన టి.వి,టి.ఎన్.ఐ, ఏక్ నజర్ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.
కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.

టాంటెక్స్ 127 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి సాహిత్య వేదిక బృందసభ్యుడుశ్రీ జలసూత్రం చంద్రశేఖర్ సమర్పించిన నివేదిక.

Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

H2kinfosys big banner Colaberry - School of Data Analytics
© 2000-2018. All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us