eknazar - desi lifestyle portal
Pittsburgh
Advertise | Contact Us
My Account
H2kinfosys big banner MindsMapped Big Banner


News

TANTEX Telugu Vaibhavam - 2017
Date: Jul 22 2017 Submitted By:  

సాహోరే తెలుగు వైభవం: సంగీత ,సాహిత్య , నృత్య సమాహరాలతో అలరించిన టాంటెక్స్ వారి ప్రత్యేక సదస్సు

జులై 8th 2017 డాలస్, టెక్సస్
31 సంవత్సరాల ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) తెలుగువైభవం మరియు ఆసంస్థ ప్రత్యేక కార్యక్రమం "నెల నెలా తెలుగు వెన్నెల" తెలుగు సాహిత్య వేదిక 10వ వార్షికోత్సవం ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఈప్రత్యేక సదస్సు తెలుగు వైభవం విశిష్ట అతిధుల సమక్షంలో అశేష అభిమానుల మధ్య స్థానిక ఇర్వింగ్ హై స్కూల్ ఆడిటోరియం లో, అధిక సంఖ్యలో పాల్గొన్నడాలస్ ప్రాంతీయ తెలుగు భాషాభిమానుల ఆదరాభిమానాలుచూరగొంటూ, అత్యంత వైభవంగా జరిగాయి. ప్రవాసంలో నిరాటంకంగా 120 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. మధ్యాహ్నం ప్రారంభమైన సాహిత్య వేదిక వార్షికోత్సవం ఉప్పలపాటి కృష్ణా రెడ్డి అధ్యక్షతనమరియుసమన్వయకర్త సింగిరెడ్డి శారద ఆధ్వర్యంలో నిర్వహించబడినది. భారతదేశం నుండి వచ్చిన ముఖ్య అతిథులు, డాలస్ లోని తెలుగు భాషాభిమానులు, సాహితీ ప్రియులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది
కార్యక్రమంలోముందుగా సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద2017 సంవత్సరంలో జరిగిన సాహిత్య కార్యక్రమాల గురించి మాట్లాడారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయఉపకులపతి ప్రొఫెసర్ వి.దుర్గాభవాని గారు తెలుగు సాహిత్యం గురించి మాట్లాడారు. విమర్శకుడు, కథ, యాత్రా రచయిత దాసరి అమరేంద్ర గారు "తెలుగు యాత్రా సాహిత్యం" అంశం మీద చక్కగా ప్రసంగించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత డా. కాత్యాయని విద్మహే గారు "తెలుగు సాహిత్య విమర్శ" అంశం మీద ప్రధాన ప్రసంగం గావించారు. సంపాదకులు,విమర్శకులు వాసిరెడ్డి నవీన్ గారు "తెలుగు కథ - మారుతున్న స్వరం" అంశం మీద ప్రసంగించారు. నాటక రచయిత డా. కందిమళ్ళ సాంబశివరావు గారు "తెలుగు నాటకం - సామాజిక చైతన్యం" అంశం మీద ప్రసంగించారు. ప్రముఖ కధా రచయిత గొర్తి బ్రహ్మానందం గారు తెలుగు సాహిత్యం మీద తెలుగు భాష సాహితీవేత్తల నడుమ చర్చ నిర్వహించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చర్చించి,విచ్చేసిన వారందరినీ ఆనందపరిచారు.విచ్చేసిన సాహితీ ప్రముఖులందరినిసంస్థ కార్యవర్గ మరియు సాహిత్య వేదిక బృందం పుష్ప గుచ్చం , దుశ్శాలువ మరియు జ్ఞాపికలతో ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సన్మానించారు.
10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫోటో కవితల పోటీకి ఆశేష ఆదరణ లభించింది. ప్రముఖ కవయిత్రి మెర్సీ మార్గరెట్ గారు ఫోటో కవితల పోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. డాలస్ కి చెందిన నశీం షేక్ రాసిన పునాదులు-సమాధులు కవితకి మొదటి బహుమతి లభించగా. రావెల పురుషోత్తమరావు గారి ఆదరాబాదరాగా కవితకి రెండవ బహుమతి లభించింది. చిలుకూరి వెంకటశాస్త్రి గారి జయహో కవితకి మూడవ బహుమతి లభించింది.
దాదాపు మూడు దశాబ్దాలకు పైగాతన జీవితాన్ని కూచిపూడికళకే అంకితం చేసి, దేశ విదేశాల్లో వందలాది నృత్య ప్రదర్శనలతోకూచిపూడి నృత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేస్తూ వాటికివిశేషపేరు ప్రఖ్యాతలు సంపాదించిన నాట్యాచార్యులు, చలన చిత్ర నృత్య దర్శకులు శ్రీ కేవీ సత్యనారాయణ గారు డాలస్ కి చెందిన నాట్య కళాకారులతో కలిసి జయహో శ్రీ కృష్ణదేవరాయ కూచిపూడి నృత్య రూపకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఎంతో ఆసక్తితో అష్ట దిగ్గజాలుగాపాల్గొన్న స్థానికభాషాబిమానుల వేష ధారణ మరియు వారి ఆసక్తి ఈ నృత్య రూపకానికి నూతన శోభ, ఉత్సాహం తెచ్చిపెట్టాయి.
భోజనానంతర విరామం తరువాత, ఈ ప్రత్యేక సదస్సు సమన్వయ కర్త మహేష్ ఆదిత్య ఆదిభట్ల ఆహ్వాన పలుకులతో, సాయంకాల వినోద కార్యక్రమాల వివరాలు అందిస్తూ, ప్రేక్షకులకు పునస్వాగతం తెలిపారు.ఈ సందర్భంగా , ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి తమ సందేశంలో31 సంవత్సరాల టాంటెక్స్ తెలుగు వైభవం మనమందరం కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న సంస్థ గామొదలైన టాంటెక్స్ ఈ నాడు అమెరికా లో ఉన్న జాతీయ తెలుగుసంస్థలతో ధీటుగాఇటు అమెరికాలో అటు ఇండియా లో కూడా గుర్తింపుతెచ్చుకుందిఅన్నారు డల్లాస్ నగరంలో లభించే ఆదరాభిమానాలగురించి అమెరికాలోనే కాకుండా, మన భారతదేశంలోను మనకు అభినందనలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి అని తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.
భారతదేశం నుంచి అమెరికాలో పర్యటన చేస్తూకార్యక్రమానికి విచ్చేసిన కోడంగల్ ఎం.ఎల్.ఎ. శ్రీరేవంత్ రెడ్డిగారికి అభినందనలు తెలుపుతూ,సంస్థ కార్యవర్గ, పాలక మండలి బృందం సన్మానం చేశారు. అటు తరువాత , కార్యక్రమానికి తనవంతు ఆర్ధిక సహాయం చేస్తూ విచ్చేసినఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రవాస భారతీయుల ఐ.టి. ప్రత్యేక ప్రతినిధి మనోహర్ రెడ్డి గారినిటాంటెక్స్ కార్యవర్గ బృందం సన్మానం చేయడం జరిగినది. అటు పిమ్మట,ప్రెసిడెన్సియల్ స్పాన్సర్ : NATSసంస్థను, లోన్ స్టార్ స్పాన్సర్స్: డా. పైల మళ్ళా రెడ్డి, డా. ప్రేమ్ రెడ్డి లను, NATA, TPAD సంస్థలను, ప్రీమియర్ స్పాన్సర్స్ : TANA సంస్థను, క్వాంట్ సిస్టమ్స్ ను, గోల్డ్ స్పాన్సర్: రాం కోనార, సౌత్ ఫోర్క్ డెంటల్ లను సభా వేదిక మీద సన్మానించారు.
సంస్థ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త తోట పద్మశ్రీ , విచ్చేసిన గాయక బృందాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయగా , ప్రత్యేకకార్యక్రమంమొదలు పెడుతూతమమృదుమైన పలుకులతో వ్యాఖ్యాతగ వ్యవహరిస్తూ, మధురమైన, అందరికి ఇష్టమైన పాటలతో ప్రముఖ గాయని సునీత గారి ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరిలో , సంగీత దర్శకుడు , గాయకుడువందేమాతరం శ్రీనివాస్, గాయకులుభార్గవి పిళ్ళై, దినకర్, యాసిన్ నజీర్ , సమీర భరద్వాజ్ లు, ఈ ప్రత్యేక సదస్సుకు విచ్చేసి కదలకుండా వింటున్న వారందరినీ ఆద్యంతం ఆకట్టుకుని సంగీత ప్రవాహంలో ముంచెత్తారు. ప్రేక్షకుల కోరికపై ఎన్నోఉత్సాహ పరిచే పాటలు వినిపించారు.
1986, సంస్థ ప్రారంభింపబడిన సంవత్సరం నుంచి2017వరకు , ఆయా సంవత్సరాలలో అత్యుతమ పాటలుగా గుర్తింపబడిన పాటల సమాహారాన్ని , తమ నృత్య నైపుణ్యాన్ని జోడించి టాంటెక్స్-చిత్రలహరి అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని, శాంతి నూతి మరియు రవి తేజ ఆధ్వర్యంలోమొదటి భాగాన్ని, కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన టాలీవుడ్నటిస్నేహ నామనంది మరియుగోమతి సుందరబాబు ఆధ్వర్యంలో రెండవ భాగాన్ని, స్థానిక కళాకారులు ప్రదర్శించారు.ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో స్థానికకళాకారుల నృత్య నైపుణ్యo, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆకట్టుకుంది.
అతిథుల సన్మాన కార్యక్రమంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, ఉత్తరాధ్యక్షులుశీలం కృష్ణవేణి, ఉపాధ్యక్షుడువీర్నపు చినసత్యం మరియు కార్యవర్గ బృందం, పాలకమండలిఅధిపతి రోడ్ద రామకృష్ణ రెడ్డి మరియు బృందం పాల్గొని పుష్ప గుచ్చం, దుశ్శాలువ మరియు జ్ఞాపికలతో ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సన్మానించారు.
ఏ కార్యక్రమానికైనా మనల్ని ప్రోత్సహించిచేయూతనిచ్చే పోషక దాతలు లేకుంటే కార్యక్రమం చేయడం సాధ్యపడదు. ప్రత్యేక అతిథులు, పోషకదాతలగౌరవార్ధంముందురోజుటాంటెక్స్వారుఏర్పాటుచేసినవిందులోపోషకదాతలుప్రతిఒక్కరినిపేరుపేరునాగుర్తించి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయo ఉప కులపతి డా. వి. దుర్గాభవాని , సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డా. కాత్యాయని విద్మహే గార్ల, ఇతర తెలుగు సాహిత్య ప్రముఖులుమరియుప్రముఖ గాయని సునీత మరియు వారి గాయక బృందంఙ్ఞాపికలుఅందచేస్తూఈ ప్రత్యేక కార్యక్రమ పోషకులవదాన్యతనుఅభినందించారు.
ప్రత్యేకప్రసారమాధ్యమాలైనఫన్ఏసియామరియుప్రసారమాధ్యమాలైనయువరేడియో,టీవీ5, టి.ఎన్.ఐ, టీవీ9 లకుకృతఙ్ఞతాపూర్వకఅభివందనములుతెలియజేశారు.ఎంతోకృషి, సమయంవెచ్చించినటాంటెక్స్కార్యవర్గసభ్యులకుమరియువివిధకమిటీసభ్యులకు, స్వచ్ఛందకార్యకర్తలకుప్రత్యేకఅభినందనలుతెలిపారు.భారతీయజాతీయగీతంఆలపించడంతో, విచ్చేసినవారందరినీ ఎంతో ఆహ్లాదపరచిన ఈ కార్యక్రమానికి తెర పడినది.

https://tantex.smugmug.com/2017-Events/Telugu-Vaibhavam-Musical-Extravaganza-July-8th-2017/>
పైన వివరించిన కార్యక్రమాలఛాయాచిత్రాలను ఈ క్రింద పొందుపరచిన లంకెలలో చూడవచ్చును.Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

FunAsia Techfios
© 2000-2018. All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us