eknazar - desi lifestyle portal
Dallas
Advertise | Contact Us
My Account | My Event Orders
Swamy the Realtor Ashok Daftary Om Realty Finance Company


News

Detriot - Indian American Kutami Adhvaryanlo Fund Raiser Programme
Date: Nov 11 2021 Submitted By:   Admin



డెట్రాయిట్ నగరంలో ఇండియన్ అమెరికన్ కూటమి వారి ఆధ్వర్యంలో ఫండ్ రైజర్ for Governor

డెట్రాయిట్, నవంబర్ 10: ఇటీవల డెట్రాయిట్ నగరంలో ఇండియన్ అమెరికన్ కూటమి వారి ఆధ్వర్యంలో జరిగిన గవర్నర్ గ్రెత్చెన్ విట్మెర్ ఫండ్ రైజర్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. డెట్రాయిట్ మెసోనిక్ టెంపుల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా అమెరికన్లు, భారత సంతతికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ధవల్ వైష్ణవ్, అశోక్ బడ్డి, మురహరి దేవబత్తిని తదితర సభ్యుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిగా గవర్నర్ గ్రెత్చెన్ విట్మెర్‌తో పాటు కాంగ్రెస్ సభ్యురాలు హ్యాలీ స్టీవెన్స్, బ్రెండా లారెన్స్, మిచిగాన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జోసెలిన్ బెన్సన్ అథితులుగా విచ్చేశారు. అలాగే వందలాది మంది వ్యాపారవేత్తలు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం మిచిగాన్ బిజినెస్‌లో భారతీయుల ఉనికిని, సత్తాని ఎత్తి చూపింది. గవర్నర్ ఫండ్ కోసం విరాళాలు సేకరించడానికి మొత్తం మిచిగాన్ బిజినెస్ కమ్యూనిటీ అంత ఒక త్రాటి మీదకు రావడం విశేషం. ఈ సందర్భంగా సమకూరిన భారీ విరాళ సేకరణతో రికార్డ్ సృష్టించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ రెప్‌ పద్మ కుప్ప మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో విట్మెర్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్టు అమెరికన్ జాతీయ గీతంతో పాటు భారత జాతీయ గీతాన్ని అశోక్ బడ్డి గారి ఆధ్వర్యంలో పాడిన పిల్లలు అందరినీ ఎంతగానో అలరించి, సభా స్ఫూర్తికి వన్నె తెచ్చారు. పలు నాట్య ప్రదర్శనలు, సమైక్య గీతాలు అందర్నీ రంజింపజేశాయి. ఈ విధమైన సభలు ప్రవాస భారతీయుల ఉనికిని చాటిచెప్పడంతో పాటు భవిష్యత్తు ప్రణాళికల్ని పటిష్టం చేస్తాయని కార్యనిర్వాహకులు తెలిపారు. అలాగే యూఎస్ రాజకీయాలలో నూతనావకాశాలతో మన పాత్రని పెంచి పటిష్టం చేయడానికి దోహద పడతాయన్నారు. అంతేగాక మన సంస్కృతి, జీవన విధానం గురించి అవగాహన పెరుగుతుందని చెప్పారు. అమెరికాలో ప్రస్తుత, రాబోయే కాలంలో ప్రవాసుల అభివృద్ధికి ఎంతో ఉపకరిస్తాయని కార్యనిర్వాహకులు చెప్పుకొచ్చారు.

Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

Sainivas Realtor Music Masti Magic
© 2021 All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us