eknazar - desi lifestyle portal
Dallas
Advertise | Contact Us
My Account
Cosmos Big Banner Srinivas Ready Real Estate


News

6th NATS America Telugu Sambaralu
Date: May 30 2019 Submitted By:   Adminఅంగరంగ వైభవంగా ప్రారంభమైన నాట్స్ తెలుగు సంబరాలు

8 వేల మందికి పైగా హాజరు

తరలివచ్చిన తెలుగు సినీతారలు.. డ్యాన్స్ హంగామాలతో సందడి

ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నాట్స్ జరిపే అమెరికా తెలుగు సంబరాలు ఇర్వింగ్ లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగుదనం ఉట్టి పడేలా అలంకరించిన వేదికలో పూర్ణ కుంభ పూజతో సంబరాలను ప్రారంభించారు. మనమంతా తెలుగు మనసంతా వెలుగు అనే భావనను ప్రతిబింబిస్తూ చేపట్టిన తొలి కార్యక్రమం తెలుగు జాతి ప్రత్యేకతను చాటింది. ఆతర్వాత 800 మంది వీఈసీ కాలేజ్ అలూమ్నై కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. గందరగోళం అంటూ మనబడి విద్యార్ధులు చేసిన ప్రదర్శన అందరిని అలరించింది.జూనియర్ ఎన్టీఆర్ మేడ్లీ చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్ అందరిచేత స్టెప్పులు వేయించింది. చిన్నారుల చేత కూడా మెడ్లీ డ్యాన్సులు వేయించి సంబరాల సంతోషాన్ని పంచారు. ఆ తర్వాత త్రీ డీ డ్యాన్స్ డ్రామా, గిరిజన నృత్యం ధింసా కూడా సంబరాలకు మంచి ఊపునిచ్చింది.

డ్యాన్సింగ్ బన్నీస్ అంటూ డ్యాన్స్ మెడ్లీ మరోసారి స్టేజ్ పై చేసిన డ్యాన్స్ కూడా విశేషంగా అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత చిచ్చర పిడుగులు, కలర్స్ ఆఫ్ డ్యాన్స్, తూర్పు కొండలు పేరుతో జానపద నృత్యం, రిథమ్స్ ఇన్ కూచిపూడి జీవితంలోని అన్ని కోణాలను స్పృజిస్తూ చేసిన నృత్యానికి మంచి స్పందన లభించింది. సంగీత పరికరాలతో నాదామృతవర్షణి కార్యక్రమం సంగీత ప్రియుల మనస్సును పరవశింపచేసింది. ఆ తర్వాత క్రీడా, మహిళ విభాగాల్లో పెట్టిన పోటీల్లో విజేతలైన వారికి ప్రత్యేక అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. అనంతరం మహానటి సావిత్రిని గుర్తు చేస్తూ ప్రత్యేకంగా చేసిన డ్యాన్స్ డ్రామా విశేషంగా ఆకట్టుకుంది.

శ్రీ కృష్ణామృతం పేరుతో కృష్ణుడి జీవితాన్నివివరిస్తూ చేసిన ఫ్యూజన్ డ్యాన్స్ డ్రామా కూడా మంచి స్పందన లభించింది. సాయంత్రం గాలిక గణేష్ పేరుతో జానపద నృత్యం, ఉట్టిమీద కూడు అంటూ బావ మరదల మధ్య సాగే జానపద నృత్యం కూడా ప్రేక్షకులతో చిందులు వేయించింది. యూత్ కమిటీ రూపొందించిన నవతరం కార్యక్రమానికి కూడా మంచి స్పందన లభించింది. ఎన్టీఆర్ జ్ఞాపకాలు పేరుతో వైవిఎస్ చౌదరి చేసిన ప్రసంగం ఎన్టీఆర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు సినీ తార చేసిన డ్యాన్స్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. మిమిక్రి శివారెడ్డి చేసిన మిమిక్రి నవ్వులు పువ్వులు పూయించింది. సంబరాల స్వాగత గేయ రచయిత సిరాశ్రీ, భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, మిమిక్రి శివారెడ్డి, జితేంద్ర, డాన్స్ మాస్టర్ సత్య తదితరులు కూడా ఈ సంబరాలలో పాలుపంచుకున్నారు.

డాక్టర్ సాయికుమార్ దానవీర శూర కర్ణ కాన్సెప్ట్ తో చేసిన పౌరాణిక ఏకపాత్రాభినయానికి ప్రేక్షకులు తమ కరతాళ ధ్వనులతో హర్షాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత తెలుగు సినిమా స్టార్ హీరోయిన్ భాను శ్రీ చేసిన డ్యాన్స్ అలరించింది. నాట్స్ ఎలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తుంది...తెలుగుజాతికి ఎలా అండగా నిలబడుతుందనేది నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి వివరించారు. ఆ తర్వాత సంబరాల చీఫ్ గెస్ట్ సినీ నటి తమన్నా స్టేజ్ మీదకు రావడంతో అందరూ ఒక్కసారిగా హర్షధ్వనాలతో స్వాగతం పలికారు. తమన్నా నాట్స్ గురించి.. అమెరికాలో తెలుగువారు చేపట్టే కార్యక్రమాల గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన మనో అండ్ గ్రూప్ మ్యూజిక్ కార్యక్రమం హుషారైన పాటలతో హోరెత్తించింది. ప్రేక్షకులు మనో పాటలకు ఆనందంతో చిందులేశారు. సంబరాల సంతోషాన్ని ఆస్వాదించారు. నాట్స్ సంబరాలకు దాతలుగా వ్యవహరించిన పలువురు దాతలకు, బోర్డ్, ఈసీ సభ్యులను సంబరాల కమిటీ నిర్వాహకులు ప్రశంసా షీల్డ్ లతో సన్మానించారు. డాక్టర్ దేవయ్య, డాక్టర్ రాజు, బాపయ్య చౌదరి నూతి, ప్రణతి పిల్లుట్ల, ఐఫర్ ఫార్మర్స్ వ్యవస్థాపకులు సురేష్, రవి ఖంఠంశెట్టి, శ్రీకాంత్ & లక్ష్మి బొజ్జ, శ్రీకాంత్ తనికొండ, వెంకన్న చౌదరి యార్లగడ్డ, సురేష్ కంకణాల, వెంకట చింతలపాటి, డా. పెద్దిరెడ్డి శ్రీధర్ ఒమేగా హాస్పిటల్ హైదరాబాద్, శేఖర్ అన్నే, న్యూజెర్సీ సాయిదత్త పీఠం వ్యవస్థాపకులు రఘుశర్మ శంకరమంచి లకు సేవా పురస్కారాలు అందించారు. బావర్చి వారు ప్రత్యేక శాఖాహార, మాంసాహార వంటలతో అతిధులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి డా. మధు కొర్రపాటి ప్రత్యేక సమావేశ మందిరంలో ఆహూతులకు వివరించారు. సాయంత్రం, 350 పేజీల సంబరాల ప్రత్యేక సంచిక తెలుగు దీపిక ను విడుదల చేశారు.

అమెరికాలో వైభవంగా ముగిసిన తెలుగు సంబరాలు

కీరవాణి సంగీతం.. తమన్నా మెరుపులు..

తెలుగు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆట పాటలతో హోరెత్తిన ఇర్వింగ్

అమెరికాలో నాట్స్ అంగరంగ వైభవంగా జరిపే అమెరికా తెలుగు సంబరాలు రెండోరోజు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే సంబరాల సందడి మొదలైంది. ఇర్వింగ్ వేదికగా జరుగుతున్న ఈ సంబరాల్లో రెండో రోజు గరుడగమన శ్రీనివాస కళ్యాణం పేరుతో చేసిన శాస్త్రీయ నృత్యం సంప్రదాయ వాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మనబడి చిన్నారుల చేసిన అష్టావధానం రూపకం ఔరా తెలుగు పిడుగులు అనిపించింది. సంబరాలకు విచ్చేసిన వారిని ఉత్సాహంతో చిందేసేలా చేసేందుకు మాస్ మెడ్లీ రంగంలోకి దిగి తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్ లు వేశారు. వేయించారు. అందమైన భామలతో డ్యాన్స్ మెడ్లీ చేసిన డ్యాన్స్ మేజిక్ కూడా ఆకట్టుకుంది. గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ చేసిన అడవితల్లి గిరిజన నృత్యానికి మంచి స్పందన లభించింది. ఇక ఆ తర్వాత డ్యాన్స్ మెడ్లీ డ్యాన్స్ వారియర్స్ పేరుతో మరోసారి సినిమా పాటలకు డ్యాన్స్ లు చేయించారు. హ్యూస్టన్ చాప్టర్ రూపొందించిన నృత్య కార్యక్రమానికి కూడా మంచి స్పందన వచ్చింది. సంప్రదాయ భారతీయ వస్త్రాలు ధరించి.. ప్రత్యేక అలంకరణలతో సాగిన తెలుగోత్సవం కార్యక్రమం కూడా విశేషంగా ఆకర్షించింది. ఆ తర్వాత కూచిపూడి నృత్యం.. సంప్రదాయ నృత్య ప్రేమికులను కట్టిపడేసింది.

తెలుగుపాటల మిక్స్ చేసిన టాలీవుడ్ టీజర్ డ్యాన్స్ కు అద్భుతమైన స్పందన లభించింది.దేశభక్తిని ప్రతిబింబిస్తూ... ప్రియభారతీ జననీ అని చేసిన నృత్యానికి అందరూ జైహింద్ అంటూ అభినందనలు తెలిపారు. సరదాగా మరదలిపిల్లను ఆటపట్టిస్తూ.. గళ్లు.. గళ్లు..చప్పుళ్లు.. అంటూ సాగిన జానపదనృత్యం మన గిరిజన సంస్కృతిని గుర్తు చేసింది. .. రాజే.. కింకరుడగును.... కింకరుడే.. రాజగున్... అంటూ ఆ సత్య హరిశ్చంద్ర చెప్పిన జీవన సత్యాలను తెలగు సినీ గాయకుడు ప్రవీణ్ అద్భుతంగా ఆలపించారు. ఆ తర్వాత మా వాణి.. బాణి.. అంటూ గేయరచయితలు.. గాయకులు కలిసి చేసిన జుగల్ బందీ కూడా అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఓ చినదాన అంటూ రాయలసీమజానపదగీతానికి చేసిన నృత్యం.. రాయలసీమ సంస్కృతిని ప్రతిబింబించింది. ఈశా గీరిశా.. అంటూ ఆ పరమశివుడిని స్తుతిస్తూ చేసిన నృత్యం కూడా విశేషంగా ఆకట్టుకుంది. అడవిచుక్కలు పేరుతో చేసిన గిరిజన నృత్యానికి మంచి స్పందన లభించింది. స్థానిక తెలుగువారిలో ప్రతిభను ప్రోత్సాహిస్తూ.. వారిలో సంగీత పాటవాన్ని వెలికితీస్తూ చేసిన కార్యక్రమం... స్వరవర్షిణికి విశేషంగా స్పందన లభించింది.

రైతు రాజ్యమే.. రామరాజ్యం అనేది చాటిచెబుతూ.. రైతుల జీవితాలపై అన్నదాత సుఖీభవ అంటూ చేసిన నృత్యరూపకం విశేషంగా ఆకట్టుకుంది. సంగీత నవవేదం పేరిట మీగడ రామలింగ స్వామి చేసిన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. తెలుగు బ్రూసిలి.. వివేక్ చిరుపల్లి చేసిన స్కిట్, జబర్ధస్ట్ ఆర్టిస్టులతో చేసిన కామెడీ ప్రోగ్రామ్ నవ్వులు పువ్వులు పూయించింది.

ఉదయం నాట్స్ బోర్డు మరియు కార్యవర్గ కమిటీ ల మీటింగ్ లు జరిగాయి. రెండో రోజు సాయంత్రం పురస్కారాల ప్రదానం జరిగింది. షార్ట్ ఫిల్మ్ విభాగంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తెలుగు హీరోయిన్ డ్యాన్స్ అందరిని అలరించింది. నీవు పెద్దపులి అంటూ చేసి జానపద నృత్యం.. అందరిని చిందులు వేయించింది. ఆ తర్వాత రప్తార్ హంగామా.. అందరిలో హుషారు నింపింది. పాప్ సింగర్ స్మిత వల్లూరుపల్లి, మిస్ టీన్ యూ.ఎస్ 2019 ఈషా కోడె లతో వుమెన్ ఫోరమ్ నారీ భేరి 2019, అటలు, డొమెస్టిక్ వయొలెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ విమెన్ అండ్ గర్ల్స్, షేర్ యువర్ ప్యాషన్ విత్ సర్ప్రైజ్ సెలెబ్రిటీ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

జననీ జన్మభూమి.. అంటూ చేసిన నృత్యం భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చేసింది. ఆ తర్వాత సంబరాలకు వచ్చిన తారలకు సత్కారం జరిగింది. టాలీవుడ్ టాప్ స్టార్ తమన్న స్టేజ్ మీదకు రావడం.. మాట్లాడటం.. ఇవన్నీ సంబరాల్లో యూత్ మంచి కిక్ ఇచ్చాయి. ఆ తర్వాత సేవా పురస్కారాలను అందించారు. ఇక సంబరాలకు అసలు సిసలైన ముగింపుత్సోవం కీరవాణి సంగీత విభావరి అందరిని అలరించింది. తెలుగు సినీ పాటల ప్రవాహంలో సంబరాలకు వచ్చిన ప్రతివారు తడిసి ముద్దయ్యేలా చేసింది. హోరెత్తే సినీ పాటలకు అందరూ కలిసి చిందేశారు. సంబరాల సంతోషంలో మునిగితేలారు. దాదాపు 8 వేల మందికి పైగా ఈ సంబరాల సంతోషంలో పాలుపంచుకున్నారు.. వచ్చే తెలుగు సంబరాలు 2012లో న్యూజెర్సీ వేదికగా జరగనున్నాయని నాట్స్ సంబరాల వేదికగా బోర్డు సభ్యుడు మరియు కన్వెన్షన్ సెలక్షన్ కమిటీ చైర్ కొత్త శేఖరం ప్రకటించారు.

చివరగా జన్మభూమి నాదేశం సదా స్మరామి అంటూ సాగిన కీరవాణి బృంద ఆలాపనలో నటుడు సాయి కుమార్ కూడా గొంతు కలిపారు.

సంబరాల కార్యక్రమాలను కవరేజ్ చేసిన ప్రతీ మీడియా సంస్థను చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, సంబరాల కమిటీ చైర్మన్ కిశోర్ కంచర్ల మరియు కమిటీ ఇతర సభ్యులు పేరుపేరునా అభినందించారు. ఈ సంబరాలలో గ్రాండ్ స్పాన్సర్స్ గా ఉన్న యువికా జెవెల్స్, శ్రీకృష్ణ, పి.ఎమ్జే వంటి ఇతర సంస్థలు, బోటిక్ నిర్వాహకులకు సంబరాల కమిటీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.

ఇన్ని వేల మందిని రకరకాల విందు భోజనాలతో ఆనంద పరిచిన బావార్చి బిర్యానీకి బోర్డు, కమిటీ సభ్యులేకాక సంబరాలకు విచ్చేసిన అతిధులు ప్రతీ ఒక్కరూ అభినందనలు తెలియచేశారు.

వందన సమర్పణ తో 2019 అమెరికా తెలుగు సంబరాలు ముగిశాయి.Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

shree raghunath temple North Dallas Mortgage
© 2000-2018. All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us