eknazar - desi lifestyle portal
Boston
Advertise | Contact Us
My Account | My Event Orders


News

NATS - Men's Singles Tennis Tournament in Houston
Date: Mar 03 2021 Submitted By:   Admin



తెలుగు వారి కోసం అమెరికాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తాజాగా తెలుగు వారిలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మెన్స్ సింగిల్స్ టెన్నీస్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ టెన్నీస్ టోర్నమెంట్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. నాట్స్ హ్యూస్టన్ క్రీడా సమన్వయకర్త చంద్ర తెర్లీ నేతృత్వంలో ఈ టోర్నెమెంట్ జరిగింది.

క్రీడా నైపుణ్యత ఆధారంగా రెండు విభాగాలుగా జరిగిన ఈ పోటీలకు ప్రతి విభాగంలోనూ ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న క్రీడాకారులకు నాట్స్ ట్రోఫీలను అందజేసి సత్కరించింది. తెలుగు వారిలో ఉత్సాహం నింపేందుకు ఇలాంటి టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడంపై నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, ప్రెసిడెంట్ శేఖర్ అన్నే నాట్స్ హ్యూస్టన్ విభాగాన్ని అభినందించారు.

Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

Radio Caravan OWB Big Banner
© 2021 All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us