నాట్స్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వెబినార్. విష్ణు వైభవాన్ని వివరించిన మేడసాని
టెంపా, ఫ్లోరిడా, జనవరి 12, అమెరికాలో తెలుగు జాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈ సారి ఆన్లైన్ ద్వారా ఆముక్త మాల్యాద, విష్ణువైభవం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వెబినార్ ద్వారా నిర్వహించింది. ఓం సాయి బాలజీ ఆలయం, నాట్స్ కలిసి ఈ వెబినార్ ఏర్పాటుచేశాయి. ప్రముఖ అవధాని, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ మేడసాని మోహన్ అముక్తమాల్యద - విష్ణు వైభవాన్ని ఎంతో చక్కగా ఈ వెబినార్‌లో వివరించారు. ఈ వెబినార్‌లో ఓం సాయి బాలజీ ఆలయ వ్యవస్థాపకులు సూర్యనారాయణ మద్దుల, రామకృష్ణ సన్నిధి ,రమేష్ తాడువాయి మరియు వంశీ తమ్మన లు సాయి బాలజీ ఆలయ విశిష్టతలు వివరించారు. నాట్స్ బోర్డ్ కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని మరియు నాట్స్ టెంపా సమన్వయకర్త ప్రసాద్ ఆరికట్ల ల సహకారంతో ఈ వెబినార్ నిర్వహించడం జరిగింది. నాట్స్ కార్యనిర్వాహక కార్యదర్శి(వెబ్)సుధీర్ మిక్కిలినేని, నాట్స్ కార్యనిర్వాహక కార్యదర్శి( మీడియా) మురళీ మేడిచెర్ల ఈ వెబినార్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించారు. శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగులో రచించిన అముక్తమాల్యద లోని పద్యాలను మేడసాని మోహన్ చక్కగా చెబుతూ వాటి అర్థాలను సైతం వివరించారు. ఆనాడు శ్రీ కృష్ణ దేవరాయలు తెలుగు భాషను కొనియాడిన తీరును ఆయన చెప్పుకొచ్చారు. మనిషికి ఆధ్యాత్మిక అవసరాన్ని మేడసాని గుర్తు చేశారు. నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, ప్రసాద్ ఆరికట్ల, రాజేష్ కాండ్రు, శ్రీనివాస్ మల్లాది మరియు సురేష్ బొజ్జా తదితరులు ఈ వెబినార్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
భాషే రమ్యం, సేవే గమ్యం అని నినదించే నాట్స్ ఈ కార్యక్రమం నిర్వహించటానికి ముందుకు వచ్చినందుకు చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శేఖర్ అన్నే లను ఓం సాయి బాలాజీ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.