eknazar - desi lifestyle portal
Bay Area
Advertise | Contact Us
My Account
Colaberry - School of Data Analytics Techfios


News

TANTEX 125 NELA NELA TELUGU VENNELA
Date: Jan 03 2018 Submitted By:  

సాహిత్యంలోరసజ్ఞతమరియుసింహావలోకనం అంశాలతోఘనంగాముగిసినటాంటెక్స్ 125వనెలనెలాతెలుగువెన్నెల

డిసెంబర్ 17, 2017 డాలస్, టెక్సస్
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారం, డిసెంబర్ 17నసాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 125 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు.

కార్యక్రమములోముందుగాప్రముఖసినీగాయనినూతనమోహన్ప్రార్థనాగీతంఆలపించారు, పిమ్మటస్వాతికిరణంచిత్రంలోని ఆనతినీయరా హరా పాటనుఆలపించిప్రేక్షకులమన్ననలనుఅందుకున్నారు.
శ్రీకొరివిచెన్నారెడ్డికంకటిపాపరాజు కవిరచించిన ఉత్తరరామాయణం లోని అన్నదానఫలమహత్యం పురాణపఠనంచేసారు. శ్రీమతిపాలపర్తిఇంద్రాణి125వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగువారిదిఉత్తమఅభిరుచితోకూడినజీవనవిధానం. ఇందుకుసంబంధించిఅనేకఉదాహరణలుమనకుశ్రీనాధునిదగ్గరనించిబాపూగారివరకూరసమయజగతిలోఎందరోమహానుభావులసాహిత్యంలోలభిస్తాయి. మనఆహారవిహారాలు,ఆట,పాట,మాటఅన్నీరసమయమే. ఈవిశేషాలన్నీఒకచోటప్రోదిచేసి టాంటెక్స్తెలుగుసాహిత్యవేదికపై 'సాహిత్యంలోరసజ్ఞత' గాప్రసంగించగా, వినిఆహూతులు ఎంతగానో ఆనందించారు. శ్రీమతిపాలపర్తి ఇంద్రాణిరచించిన- మూడోకవితాసంకలనం,'ఇంటికొచ్చినవర్షం'; తల్లీపిల్లలహృద్యమైనసంభాషణలపుస్తకం,'చిట్టిచిట్టిమిరియాలు'; మొదటినవలిక, 'ఱ' పుస్తకాలుసాహితీమిత్రులచేఇదేవేదికపైఆవిష్కరించబడ్డాయి. తదనంతరంశ్రీమద్దుకూరిచంద్రహాస్ఆవిష్కరించబడినపుస్తకాలనుశ్రోతలకుపరిచయంచేసారు.
ఈకార్యక్రమంలోముఖ్యమైనఅంశం సింహావలోకనం 2017వసంవత్సరంలోజనవరినుండిడిసెంబర్మాసంవరకునెలనెలాజరిగినసాహిత్యసదస్సులనుగుర్తుచేసుకోవటంఒకవిశేషం. ఇదితమదైనశైలిలోప్రేక్షకులకుమరొక్కసారిగుర్తుచేసారుకార్యక్రమసమన్వయకర్తశ్రీమతిశారదసింగిరెడ్డి.
సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ ముఖ్య అతిథిని పుష్పగుచ్ఛముతోసత్కరించగాఅధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి,ఉత్తరాధ్యక్షులుశీలంకృష్ణవేణిదుశ్శాలువామరియు కార్యక్రమ సమన్వయకర్త సింగిరెడ్డి శారద మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తక్షణ పూర్వాధ్యక్షులుజొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు వీర్నపు చినసత్యం,సమ్యుక్తకార్యదర్శి కోడూరుకృష్ణారెడ్డి సాహిత్య వేదిక బృంద సభ్యులు తెలకపల్లిజయ, కర్రిశశి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమన్వయకర్త సింగిరెడ్డి శారద సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభి మానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 5, టి.ఎన్.ఐ,ఏక్నజర్లకుకృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.


కార్యక్రమంలోనిఛాయాచిత్రాలనుఈలంకెలోచూడవచ్చును


టాంటెక్స్125వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి డా. కలవగుంట సుధ సమర్పించిన నివేదిక.

Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

MindsMapped Big Banner H2kinfosys big banner
© 2000-2018. All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us