eknazar - desi lifestyle portal
Global
Advertise | Contact Us
My Account | My Event Orders


News

ATA-UGADI Sahitya Sadassu
Date: Apr 21 2021 Submitted By:   Adminఅద్భుతంగా జరిగిన అమెరికా తెలుగుసంఘం(ఆటా)ఉగాది సాహిత్యసదస్సు

'ఆటాఉగాదిసాహిత్యసదస్సు' కార్యక్రమంఅధ్యక్షులుభువనేశ్బూజాల,ఆటా కార్యవర్గబృందం ఆధ్వర్యంలో అతిఘనంగా జూమ్లో నిర్వహించారు. సాహిత్య వేదిక కమిటి అధిపతి శారదసింగిరెడ్డి మరియు సహబృందం కార్యక్రమనిర్వహణ విజయవంతగా జరిపారు.ముందుగా శారదసింగిరెడ్డి శ్రీప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ సభకి స్వాగతం పలికారు. సాహిత్యం కేవలం మనస్సుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమేకాకుండా ఒక వ్యక్తివ్యక్తిత్వంలో వికాసానికి కూడా తోడ్పడుతుంది అనితనభావాన్ని వ్యక్తంచేసారు.

ఆటా సాంస్కృతిక విభాగం ఉపాధిపతియామినిస్ఫూర్తిమేడూరు ప్రార్థనాగీతాన్ని ఆలపించారు. కృష్ణవేణిమల్లవజ్జల సాహిత్య సదస్సుకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అధ్యక్షులు భువనేశ్బూజాల తెలుగువారందరికి ఆటా సంస్థతరపున ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసారు.ఆటాసంస్థ మనసంస్కృతిని గౌరవిస్తూ,మనసాంప్రదాయాన్ని ప్రేమిస్తూ, మనవిలువలని కాపాడుకుంటూ, మనపండగలను బంధుమిత్రులతో జరుపుకుంటూ వీటన్నిటిని ముఖ్యంగా మన బావితరాలకు అందిస్తూ ముందుకువెళుతుంది అని,ఆటా ఎప్పటికి మనభాషకి, మన సాహిత్యానికి పెద్దపీటవేస్తుంది అనితెలియచేసారు.

శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు డా.శంకరమంచిరామకృష్ణశాస్త్రి 'పంచాంగశ్రవణం' వినిపించారు. పంచాంగశ్రవణంలో భాగంగా ప్లవనామసంవత్సరంలో ద్వాదశరాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాన్ని అలాగే అన్నిరాశుల ఆదాయవ్యయాలను, గ్రహగతులను, అలాగే వ్యక్తిగత అనుకూలతల కొరకు సలహాలు సూచనలను వారు వివరించడం జరిగింది. మహాసహస్రావధాని, ప్రవచనకిరీటి డా.గరికిపాటి నరసింహారావు 'ఆశావాది -ఉగాది'అనే అంశంపైన అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు. మనిషినిత్యజీవితంలో దురాశకుఅలాగే నిరాశకురెండింటికీలోనుకాకూడదని, ఆశావాదిగా ఉండాలిఅని, కేవలం నేటిగురించి మాత్రమే ఆలోచించాలి అనిఅప్పుడే ప్రశాంతమైన జీవితం సాధ్యమౌతుంది అని, ఉగాదిపచ్చడిలాగానే జీవితంలో కష్టసుఖాలు అన్ని సమపాళ్లలో ఉన్నప్పుడే జీవితంవిలువ తెలుస్తుంది అని వివరించారు.

ప్రముఖ సినీగేయ రచయిత వనమాలిమారుతున్న కాలంలో సినీగేయరచయితల పరిస్థితులు, తెలుగుభాషకు తగ్గుతున్న ప్రాధాన్యతమొదలైన అంశాలతో కూడిన చక్కటి కవితను వినిపించారు.హాస్యఅవధానిడా.శంకర్నారాయణ‘ఖతర్నాక్మన్మధకాస్తజాగ్రత్త’అంటూతనదైనహాస్యపుజల్లులతో కవితలను చదివి వినిపించి ఆహుతులను ఆకట్టుకున్నారు.

ప్రముఖ రచయితకవి డా.అఫ్సర్కరోనా టైంలో ఏర్పడుతున్ నపరిస్థితుల గురించి వివరిస్తూనే మరోవైపు ప్లవసంవత్సరంలో 'భావిఆశలుగాభ్రాతగాఉండాలి' అనే చక్కటి కవితను చదివి వినిపించారు. ప్రముఖ కథా రచయిత పాత్రికేయులు మునిసురేష్పిళ్ళై'ఎందుకు' అనేకథాశీర్షికతోకొవిడ్పరిస్థితులనేపథ్యంలో ఏర్పడిన దుస్థితినీ తెలియజేస్తూ ఈ ఉగాది నుండి అయిన బాగుండాలి అనే అద్భుతమైన అర్థంతో కూడిన కవితని వినిపించారు.
సాహిత్యవేదిక కమిటి ఉపాధిపతిపవన్గిర్లవేదికలో పాల్గొన్న ముఖ్య అతిథులకు, వ్యాఖ్యాత కృష్ణవేణిమల్లావజ్జలకు కార్యక్రమంవిజయవంతం కావటానికి కృషిచేసిన ఆట కార్యవర్గ బృందసభ్యులకు అలాగే ప్రోగ్రాంకి ఎంతగానో సహకరించిన ఏబిఆర్ప్రొడక్షన్స్మరియువారి సాంకేతికనిపుణులందరికి, మీడియామిత్రులుటీవీ5, మనటీవీ, యోయో, ఎన్ఆర్ఐ రేడియో అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసారు.

Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

© 2021 All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us