వీసా, వేతన పెరుగుదల అంశాలపై నాట్స్ వెబినార్
ఎన్నో విలువైన విషయాలు వెల్లడించిన భాను బాబు
టెంపా, ఫ్లోరిడా అక్టోబర్ 12: అమెరికాలో కోవిడ్ విజృంభన తర్వాత వీసాలు, వేతనాల విషయలో అనేక చట్టపరమైన మార్పులు చేసింది. ఈ కొత్త మార్పులు ఎవరిపై ఎలా ప్రభావాన్ని చూపుతాయనే అంశంపై ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్.. న్యాయ నిపుణుడితో వెబినార్ నిర్వహించింది. నాట్స్ టెంపా విభాగం నిర్వహించిన ఈ వెబినార్‌కు బిబిఐ లా గ్రూప్ అటార్నీ భాను బాబు ఇలింద్ర విచ్చేశారు. ఈ నెల 8 నుంచి అమలు చేస్తున్న హెచ్1బి, ఓఈఎస్ వేతన పెరుగుదల వంటి వాటిపై వచ్చిన కొత్త మార్పులపై పూర్తి అవగాహన కల్పించారు. హెచ్ 1-బి వీసాదారులకు, భవిష్యత్తులో హెచ్ -1 బి ఆశావాదులకు కొత్త మార్పులు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేది భాను బాబు వివరించారు. వీసాలు, వేతన పెరుగుదలపై వెబినార్‌లో చాలా మంది అనేక ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తారు. వాటన్నింటికి భాను బాబు ఇలింద్ర సవివరమైన సమాధానాలు చెప్పి.. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ వెబినార్‌కు వ్యాఖ్యతలుగా నాట్స్ బోర్డు సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని, ఫ్లోరిడా చాప్టర్ కోఆర్డినేటర్ ప్రసాద్ ఆరికట్ల వ్యవహరించారు. నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, రాజేశ్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, శివతాళ్లూరు, సురేష్ బొజ్జా, నవీన్ మేడికొండ తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో, H1B ఉద్యోగుల సమస్యలపై సందర్భోచితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు టెంపా, ఫ్లోరిడా చాప్టర్ ను నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నేఅభినందించారు.
ఈ వెబినార్ పూర్తి వీడియో కోసం ఈ లింక్ లో చూడవచ్చు. https://www.youtube.com/user/thenatsworld