eknazar - desi lifestyle portal
Global
Advertise | Contact Us
My Account | My Event Orders
Saregaram Radio Caravaan US Hotstar


News

NATS Pani Puri Stalls in St. Louis
Date: Nov 07 2019 Submitted By:   Admin



క్యాన్సస్ లో నాట్స్ పానీపూరి స్టాల్
వినూత్న ఆలోచనతో విరాళాల సేకరణ

సెయింట్ లూయిస్: నవంబర్ 4: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈ సారి సరికొత్తగా ఆలోచించింది. క్యాన్సస్ లో నాట్స్ పానీ పూరి స్టాల్ ఏర్పాటు చేసింది. నాట్స్ సభ్యులు ఒక్క రోజు పానీ పూరి స్టాల్ ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని హిందు దేవాలయానికి విరాళంగా ఇచ్చారు. నాట్స్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. 1500 డాలర్ల పానీ పూరి స్టాల్ ద్వారా లభించడంతో నాట్స్ సంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని స్థానిక హిందుదేవాలయ నిర్మాణానికి విరాళంగా అందించింది. క్యాన్సస్ లో నాట్స్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడంపై స్థానిక తెలుగువారు హర్షం వ్యక్తం చేశారు. క్యాన్సస్ నాట్స్ చాప్టర్ ఇలా వినూత్నంగా ముందుకు వెళ్లడంపై నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి క్యాన్సస్ నాట్స్ నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.


Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

Radio Caravan Cosmos Big Banner
© 2000-2018. All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us