eknazar - desi lifestyle portal
Global
Advertise | Contact Us
Cosmos Travel Bookotrip


News

TANTEX SANKRATHI SAMBARALU 2017
Date: Feb 02 2017 Submitted By:  

అట్టహాసంగా జరిగిన టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు

డాలస్/ఫోర్ట్ వర్త్ , 28 జనవరి 2017

సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం అని అర్ధం. సూర్యుడు మకర రాశిలో చేరగానే వచ్చే సంక్రాంతి పండుగ అంటే తెలుగు వాళ్ళకు ఎంతో ఇష్టం. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ఎంత గొప్పగా జరుగుతుందో వర్ణించడానికి మాటలు చాలవు. పచ్చని పొలాలు, వెచ్చని చలిమంటలు, భోగిపళ్లు, హరిదాసులు , కనుమ విందు వంటకాలను జ్ఞప్తికి తెచ్చేలా ఉత్తర అమెరికాలో అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన టాంటెక్స్వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రసవత్తరమైన కార్యక్రామాలు రూపొందించారు. సంప్రదాయానికి పెద్ద పీట వేసి , ఆధునికతను మేళవించి తెలుగు మనసులను రంజింపచేసి సాంస్కృతికబృంద సమన్వయకర్త లక్ష్మి పాలేటి , కార్యక్రమ సమన్వయకర్త జ్యోతి వనం గార్లఆధ్వర్యంలో, ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారి అధ్యక్షతన డాలస్ లో జనవరి 28వ తేదీన డాలస్లో ఇర్వింగ్ హైస్కూల్లో లో టాంటెక్స్సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సారి అతిపెద్ద విశేషం ఏమిటంటే నూతన సంవత్సర కానుకగా టాంటెక్స్వారు ఈ సంక్రాంతి సంబరాలకు, సభ్యులకు ఉచిత విందుభోజనం, ఉచిత ప్రవేశం కల్పించి, రసవత్తరమైన విందు వినోద కార్యక్రమాలు అందించుట.

కార్యక్రమానికి ప్రధాన వ్యాఖ్యాతలు గా సమీరా ఇల్లందుల, మధుమహిత మద్దుకూరి, అభినుత మద్దుకూరి లు ఆద్యంతంహాస్యరసభరితంగా వ్యాఖ్యానం నిర్వహించారు. అమెరికన్ జాతీయగీతంతో ప్రారంభమైన కార్యక్రమాలు, సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా ఆసక్తి కరంగా సాగాయి. శాస్త్రీయ నృత్యం చూస్తే టాంటెక్స్ వేడుకలలోనే చూడాలి అనే మాటను ఎప్పటిలా నిజం చేస్తూ శ్రీ లక్ష్మి తోరం గారి రూపకల్పనలో చక్కని నాట్య ప్రదర్శన, గిరిజా ఆనంద్ గారి రూపకల్పనలో శివ పూజకు వేళాయరా, శ్రీ దేవి యడ్లపాటి గారి ఆధ్వర్యంలో శంభో శివ శంభో అనే సినీ నృత్యగీతం, జయలక్ష్మి గొర్తి గారి రూపకల్పనలో శ్రీమాన్నారాయణ శాస్త్రీయ నృత్యం, రూప బంద గారి రూపకల్పనలో ఓం మహాప్రాణ దీపం నృత్యం, హేమమాలిని చావలి గారి కొలువైతివా రంగ సాయి అంటూ చక్కని సాంప్రదాయక నృత్యాలు కనుల విందు చేశాయి. మరి జోష్ ఉన్న పాటలు, డాన్సులు లేకుండా ఎలా ? దీని సమాధానంగా టైం టు పార్టీ అంటూ సునీత ఆలపాటి గారి టీం , గోపికమ్మ చాలును లేమ్మా అంటూ రాజేష్ వెలనాటి గారి జట్టు, లాలాగూడ లంబాడి పిల్ల అంటూ విజయ నెట్టెం గారి టీం , ఇలా కార్యక్రమాలు అత్యంత హుషారుగా సాగాయి.
2017 వ సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని, టాంటెక్స్నూతన అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారిని తక్షణ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు సభకు పరిచయం చేశారు. అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, ఈ సంక్రాంతి పర్వదినాన నూతన ఉత్సాహంతో తెలుగు భాషకు, ప్రజలకు సేవ చేయడమే పరమార్ధంగా, నిస్వార్ధ కళా సేవకులు , నిర్విరామ శ్రామికులు తన కార్యవర్గ సభ్యుల అండదండలతో ఉత్తర అమెరికా తెలుగు ప్రజలకు తన శాయశక్తులా సహాయ పడతానని, 31 సంవత్సరాల చరిత్ర కలిగిన టాంటెక్స్ వంటి విశిష్ట సంస్థకు అధ్యక్షుడిని చేసినందుకు సర్వదా కృతజ్ఞుడిని అని, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి టాంటెక్స్ సంస్థ ప్రజలకు మరింత చేరువయ్యేలా చేసి, తెలుగు జాతి మొత్తం గర్వపడేలా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని, మహా తెలుగు సభలు టాంటెక్స్ ఆధ్వరంలో నిర్వహిస్తామని సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ప్రసంగించారు.
తక్షణ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారుమాట్లాడుతూ, నూతన కార్యవర్గం అత్యుత్సాహంతో బాధ్యతలు పంచుకొనేందుకు సంయక్తం అవడం , గడచిన సంవత్సరం అంతా మీరు అందించిన సహాయ సహకారాలు ఈ సంవత్సరం కూడా కొనసాగించమని, తెలుగు జాతి అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారికి శాలువా కప్పి పుష్పగుచ్చాలతో టాంటెక్స్అధ్యక్షులు కృష్ణా రెడ్డి ఉప్పలపాటి గారు, పాలకమండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. అలాగే కార్యనిర్వాహక/పాలక మండలి సభ్యులుగా విశేష సేవలందించి, బయటకు వచ్చిన జ్యోతి వనం, వెంకట్ దండ , రఘుగజ్జల,సుగన్ చాగర్లమూడి, శ్రీనివాస రెడ్డి గుర్రంలను శాలువా, జ్ఞాపిక తో సత్కరించారు.

2016సంవత్సరపుపోషక దాతల నందరిని కృష్ణారెడ్డి ఉప్పలపాటి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, మరియు మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సంక్రాంతి కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినT.A.T.A. సంస్థ ప్రస్తుత అధ్యక్షులు మరియుడైమండ్పోషక దాత డా. ఝాన్సి రెడ్డి గారిని అభినందిస్తూ, వారిని ఘనంగా శాలువతో, జ్ఞాపికతో సత్కరించడం జరిగినది.

క్రొత్తగా ఎన్నికైన కార్యనిర్వాహక సభ్యులు భాను లంక , మనోహర్ కాసగాని, ప్రబంధ రెడ్డి తోపుదుర్తి, శరత్ రెడ్డి ఎర్రం, సమీరా ఇల్లందులను మరియు పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి, రాం కొనార , వేణు పావులూరి లను సాదరంగా కమిటీలోకి ఆహ్వానించారు. సంక్రాంతికార్యక్రమపోషకదాతలుచంద్రశేఖర్ కాజ లను,అజయ్ గోవాడ, శ్రీలు మండిగ గార్లనుసత్కరించారు. కార్యక్రమ ప్రసార మాధ్యమాలు అయిన దేశి ప్లాజా, టీవీ 9, టీవీ 5, TNIలకు ఈ సందర్భంగా జ్ఞాపికలు అందచేసారు.

తిరిగి ప్రారంభం అయిన కార్యక్రమాలలో విశిష్ట అతిధి, బుల్లి తెర వ్యాఖ్యాత, చలన చిత్ర నటుడు జెమిని సురేష్ గారు తన సినీ అనుభవాలను , కళాకారులు కావాలంటే ఎటువంటి తపన, కార్యదీక్ష ఉండాలో , తన సినీ అనుభవాలు అన్ని పూస గుచ్చినట్లు వర్ణించారు. జెమిని సురేశ్ గారిని ఉప్పలపాటి కృష్ణరెడ్డి గారు జ్ఞాపికతో సత్కరించారు. స్వరమంజరి అనే కార్యక్రమం ద్వారా టాంటెక్స్ వారు నూతన కళాకారులను వెలుగులోకి తెచ్చి వారికి చక్కని అవకాశాలు కల్పిస్తారు. ఆ కార్యక్రమంలో 2016 విజేతలయిన స్నిగ్ధ ఏలేశ్వరపు, కీర్తి చామకూర , దీపికా కాకర్ల అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను మైమరపింప చేశారు.

ఇలా కార్యక్రమాలు జోరుగా హుషారుగా సాగిపోయాయి. ఆహూతులకు టచ్ నైన్ వారు చిన్నారులకు పిజ్జా, బర్గర్లతో పాటు సాంప్రదాయక తెలుగు వంటలతో , ఘుమఘుమ రుచులతో పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో చీరలు, చుడిదార్లు, గాజులతో నిండిన ఎన్నో స్టాల్ లు అతివలకోసం సిద్ధంగా ఉంచారు. అక్కడే టాక్స్ ఫైలింగ్ ఏర్పాట్లు, యోగ, ఆర్యోగ సంభందిత స్టాల్ లు ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొనే వీలు కల్పించారు.

సంక్రాంతి సంబరాలు కార్యక్రమ సమన్వయకర్త జ్యోతి వనం , ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు, రుచికరమైన విందు భోజనం వడ్డించిన టచ్ నైన్ రెస్టారెంట్ యాజమాన్యంకు, మరియు నేటి కార్యక్రమ పోషకులకు కృతఙ్ఞతలు తెలియజేశారు.

ఎక్కడ చూసినా సంతోషంతో వెల్లివిరియగాటాంటెక్స్ సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిసాయి.

కార్యక్రమంలోనిఛాయాచిత్రాలనుఈలంకెలోచూడవచ్చును.

టాంటెక్స్సంక్రాంతి సంబరాలగురించి జలసూత్రం చంద్రశేఖర్ సమర్పించిన నివేదిక.


Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

MindsMapped Big Banner FunAsia
© 2000-2016. All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us